Andhra Pradesh: నంద్యాల జిల్లా విచిత్ర ఘటన.. తవ్విన కొద్దీ బయపడుతున్న శివలింగాలు..!

Andhra Pradesh: ఆ గ్రామస్తులు ఓ కార్యం తలపెడితే.. విధి మరోలా నిర్ణయించింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.

Andhra Pradesh: నంద్యాల జిల్లా విచిత్ర ఘటన.. తవ్విన కొద్దీ బయపడుతున్న శివలింగాలు..!
Shiva Linga
Follow us

|

Updated on: Jun 19, 2022 | 5:33 AM

Andhra Pradesh: ఆ గ్రామస్తులు ఓ కార్యం తలపెడితే.. విధి మరోలా నిర్ణయించింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వీరబ్రహ్మం గారి మఠం కట్టేందుకు పునాదులు తవ్వుతుంటే.. శివలింగాలు భయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలుమూరు గ్రామంలో పురాతన కాలం నుంచి అవదూత వీర బ్రహ్మం స్వామి వారికి మఠం ఉంది. ఇక్కడ భక్తులు పూజలు కూడా చేసేవారు. నమ్మిన భక్తుల కోర్కెలు తీరుస్తారని గ్రామస్తుల నమ్మకం కూడా. ఎప్పుడో పాత కాలంలో కట్టిన మఠం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆదే ప్రాంతంలో మఠం నిర్మించాలని గ్రామస్తులు తీర్మానించారు. పనులు కూడా మొదలెట్టారు. కానీ నిర్మాణ పనుల కోసం భూమిని తవ్వుతుంటే శివలింగాలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 శివలింగాలు ప్రత్యక్షమయ్యాయి. అది కూడా స్వామి వారి తలభాగంలోనే కనిపించాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. బ్రహ్మంగారి మఠం కట్టాలని పూనుకుంటే.. శివలింగాలు భయటపడటంతో గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కొందరు మఠం నిర్మాణం చేపట్టాలని కోరుతుంటే.. మరి కొందరు శివాలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.