AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఏముంది సీన్..వేసవిలో మంచు విందు..పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి సోయగాలు..ఎక్కడో తెలుసా?

పెరుగుతున్న ఎండలు.. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. హాట్ సమ్మర్ లో కూల్ క్లైమేట్ పలకరిస్తే ఎలా ఉంటుంది..? ఎస్.. అటువంటి ఆహ్లాదకర వాతావరణమే అల్లూరి ఏజెన్సీలో కనిపించింది. శనివారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆంధ్ర ఒకటి అరకు సహా పాడేరు పరిసర ప్రాంతాల్లో కూల్ క్లైమేట్ పలకరించింది.

ఆహా.. ఏముంది సీన్..వేసవిలో మంచు విందు..పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి సోయగాలు..ఎక్కడో తెలుసా?
Summer Fog In Araku
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 09, 2026 | 10:17 AM

Share

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మాత్రం మంచుతో ముస్తాబై పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో భానుడు భగభగమంటుంటాడు. కానీ, అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

అల్లూరి ఏజెన్సీలో మండు వేసవిలో మంచు కురిసింది. తెల్లవారుజామున నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు దట్టంగా అలముకుంది. ఘాట్ రోడ్ లో పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఏజెన్సీలోని వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం కొన్నిచోట్ల పొగ మంచు, 11 గంటల తర్వాత భారీగా ఎండ, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిక వాతావరణం మారి ఇప్పుడే రోజులుగా వర్షం కురుస్తుంది. శనివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. మినుములూరు లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అరకులో 15 పాడేరులో 16డిగ్రీలు, చింతపల్లిలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ముందు రోజు భారీగా ఉష్ణోగ్రతలు నమోదైతే మరుసటి రోజు ఏజెన్సీలో ఇటువంటి వాతావరణం కనిపిస్తుందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

పాలసముద్రంలా వంజంగి..

ఏజెన్సీలో పొగ మంచు కారణంగా ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వంజంగి మేఘాలకొండ లోయలు.. మంచు కారణంగా పాల సముద్రాన్ని తలపిస్తోంది. పాడేరు ఏజెన్సీలో పలుచోట్ల వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఉదయాన్నే ఆ పొగ మంచు తెరలనుంచి ఉదయభానుడు.. లేలేత కిరణాలతో పలకరించాడు. పండు వేసవిలో సుందర ప్రకృతి దృశ్యాలు కనువిందుతో పర్యాటకులు సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌