బుడ్డొడిని చితకబాదిన టీచర్‌..వాతలు చూసి తల్లి ఆవేదన

బుడ్డొడిని చితకబాదిన టీచర్‌..వాతలు చూసి తల్లి ఆవేదన

ఓ పైవేటు స్కూల్‌ టీచర్‌ పైశాచికం ప్రదర్శించింది. స్టడీ అవర్‌లో పిల్లాడు అల్లరి చేశాడనే నెపంతో ఇష్టం వచ్చినట్లుగా చితకబాదింది. కృష్ణ జిల్లా నందిగామలోని శ్రీ చైతన్య స్కూల్ లో రెండో తరగతి విద్యార్ధి పఠాన్ ఖాన్ ను క్లాస్ టీచర్ జయలక్ష్మీ చితకబాదింది… విషయం తెలుసుకున్న పఠాన్ తల్లి పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ని నిలదీసింది.. అయితే ఈరోజు టీచర్ జయలక్ష్మీ సెలవు పెట్టింది.. ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం వల్లే కొట్టినట్లు ప్రిన్సిపల్ తెలపడంతో  తల్లి […]

Pardhasaradhi Peri

| Edited By: Srinu Perla

Dec 07, 2019 | 8:12 PM

ఓ పైవేటు స్కూల్‌ టీచర్‌ పైశాచికం ప్రదర్శించింది. స్టడీ అవర్‌లో పిల్లాడు అల్లరి చేశాడనే నెపంతో ఇష్టం వచ్చినట్లుగా చితకబాదింది. కృష్ణ జిల్లా నందిగామలోని శ్రీ చైతన్య స్కూల్ లో రెండో తరగతి విద్యార్ధి పఠాన్ ఖాన్ ను క్లాస్ టీచర్ జయలక్ష్మీ చితకబాదింది… విషయం తెలుసుకున్న పఠాన్ తల్లి పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ని నిలదీసింది.. అయితే ఈరోజు టీచర్ జయలక్ష్మీ సెలవు పెట్టింది.. ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం వల్లే కొట్టినట్లు ప్రిన్సిపల్ తెలపడంతో  తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. వాతలు తేలేలా కొట్టడం ఏమిటని ప్రశ్నించింది..దీనిపై సరైన సమాధానం రాకపోవడంతో తల్లి కుమారుడితో కలసి అక్కడే బైఠాయించింది. తమ కుమారుడిని కొట్టిన టీచర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu