అడుగు ఎత్తున్న ఆవుదూడ !

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా సంతానం కలుగని ఓ ఆవు..ఇటీవలే దూడకు జన్మనిచ్చింది. అయితే, ఇందులో అరుదు, అద్భుతం ఏముంది అనుకుంటున్నారా..? అయితే, ఇక్కడే అసలు విషయం దాగివుంది. గుమ్మిలేరు గ్రామంలోని రైతు ముత్యాల రావు ఇంట్లో ఉన్న ఒంగోలు ఆవు పుంగనూరు దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడ ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉంటడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శాస్త్ర సాంకేతికను ఉపయోగించి వారు ఆవుకు సంతానం గర్భధారణ చేశారట. ఒంగోలు ఆవుకు […]

అడుగు ఎత్తున్న ఆవుదూడ !
Follow us

|

Updated on: Oct 30, 2019 | 10:30 AM

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా సంతానం కలుగని ఓ ఆవు..ఇటీవలే దూడకు జన్మనిచ్చింది. అయితే, ఇందులో అరుదు, అద్భుతం ఏముంది అనుకుంటున్నారా..? అయితే, ఇక్కడే అసలు విషయం దాగివుంది. గుమ్మిలేరు గ్రామంలోని రైతు ముత్యాల రావు ఇంట్లో ఉన్న ఒంగోలు ఆవు పుంగనూరు దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడ ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉంటడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

శాస్త్ర సాంకేతికను ఉపయోగించి వారు ఆవుకు సంతానం గర్భధారణ చేశారట. ఒంగోలు ఆవుకు పుంగనూరు బీజం వేసి ఈ ప్రయోగం చేశారట. వారి ప్రయత్నం ఫలించింది. ఆవు దూడకు జన్మనిచ్చింది. పుట్టిన ఆ పుంగనూరు దూడ ఎత్తు 15.6 అంగుళాలు కాగా, వెడల్పు 16 అంగుళాలుగా ఉందని ముత్యాల వీర భాస్కర్‌ రావు తెలిపారు. ఆవు దూడను ఎత్తుకుని ఆ ఇంటి వారంతా ఎంతో ముద్దు చేస్తున్నారు. వారిఇంట్లో చాలా కాలానికి పుట్టిన బంగారంగా వారు మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే..అంత చిన్నిదూడను చూసేందుకు చుట్టు పక్కల జనాలు క్యూ కడుతున్నారు.