స్పీకర్ కోడెల దాడి కేసులో నిందితుల గుర్తింపు

గుంటూరు జిల్లాలో ఎన్నికల ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా.. రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌తో.. ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. ఈ క్రమంలోనే కోడెల శివప్రసాద్ దాడి ఘటనలో నిందితులను గుర్తించి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఇనిమెట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజున.. ఇనిమెట్లలో వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కోడెల శివప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చినిగిన చొక్కా.. గాయాలతోనే […]

స్పీకర్ కోడెల దాడి కేసులో నిందితుల గుర్తింపు
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 11:17 AM

గుంటూరు జిల్లాలో ఎన్నికల ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా.. రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌తో.. ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. ఈ క్రమంలోనే కోడెల శివప్రసాద్ దాడి ఘటనలో నిందితులను గుర్తించి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఇనిమెట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలింగ్ రోజున.. ఇనిమెట్లలో వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కోడెల శివప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చినిగిన చొక్కా.. గాయాలతోనే ఆయన పోలింగ్ కేంద్రానికి‌ వెళ్లి ఓటు వేశారు. ఇనిమెట్లలోని 106వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు కోడెల. భద్రత లేకుండా పోలింగ్ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోడెల డిమాండ్ చేశారు.