Andhra Pradesh: ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో మావోల కలకలం.. భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం

|

Jan 27, 2023 | 8:56 AM

రెండు రాష్ట్రాల సరిహద్దు తులసి అటవీ ప్రాంతంలోని జార్జ్బట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. డంపులో ఎయిర్ పిస్టల్ బ్యారల్ గ్రానైట్ లాంచర్ స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh: ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో మావోల కలకలం.. భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం
Andhra Odisha Boundary
Follow us on

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో మావోయిస్టుల కలకలం సృష్టించింది. సరిహద్దుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు తులసి అటవీ ప్రాంతంలోని జార్జ్బట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. డంపులో ఎయిర్ పిస్టల్ బ్యారల్ గ్రానైట్ లాంచర్ స్వాధీనం చేసుకున్నారు. 13 మందు పాత్రలు డంపు నుంచి బయటపడ్డాయి. ఎస్ ఎల్ ఆర్ తుపాకీ ఒకటి స్వాధీన పరుచుకున్నారు.

113 రకాల సామాగ్రి, పేలుడు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్ట్‌ల కదలికలపై కన్నేసిన ఇరు రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ డంప్ బయటపడింది. ఈ డంప్‌ బయటపడటంతో పోలీసుల తనిఖీలు పెంచారు. దొరికినవి ఇవి అయితే, దొరకనివి ఇంకెన్నీ అన్న కోణంలో సోదాలు చేస్తున్నారు. భారీగా ఆయుధాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అండర్‌ గ్రౌండ్‌లో మావోయిస్ట్‌లు పెద్ద ఎత్తున పథక రచన చేస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..