AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరు ఊరినే వణికిస్తున్న గుండెపోటు…గంటల వ్యవధిలోనే వరుస మరణాలు..! మరెక్కడో కాదు..

ఊరు ఊరినే వణికిస్తున్న గుండెపోటు...గంటల వ్యవధిలోనే వరుస మరణాలు..! ఒకే గ్రామం.. కొన్ని గంటల వ్యవధి.. ఇద్దరి ప్రాణాలను గుండెపోటు బలిగొంది. ఉదయం లేచే సమయానికి ఒక కుటుంబంలో విషాదం నిండితే.. కొద్ది గంటలకే మరో ఇంట్లోనూ అదే విషాదం చోటుచేసుకుంది. వరుసగా ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఊరు ఊరినే వణికిస్తున్న గుండెపోటు...గంటల వ్యవధిలోనే వరుస మరణాలు..! మరెక్కడో కాదు..
Village Heart Attack Deaths
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 6:20 PM

Share

ఒకే గ్రామం.. కొన్ని గంటల వ్యవధి.. ఇద్దరి ప్రాణాలను గుండెపోటు బలిగొంది. ఉదయం లేచే సమయానికి ఒక కుటుంబంలో విషాదం నిండితే.. కొద్ది గంటలకే మరో ఇంట్లోనూ అదే విషాదం చోటుచేసుకుంది. వరుసగా ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో అదే గ్రామానికి చెందిన బి. వెంకటేష్ (37) గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. ఇంటి వద్దే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 37 ఏళ్లకే వెంకటేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటంతో.. వారి భవిష్యత్తు తలచుకుని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.

వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదం నెలకొన్న కొద్దిసేపటికే మరో పక్క అదే గ్రామంలో నివాసం ఉంటున్నా మరో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మదిరి నరసింహులు (70) కు ఉదయం 9 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఒకే రోజు.. గంటల వ్యవధిలోనే ఇద్దరు గ్రామస్తులు గుండెపోటుతో మృతి చెందడంతో బోడబండలో విషాదం మరింత విషాదంగా మారింది. నరసింహులుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండు కుటుంబాల్లోనూ ఆప్తులను కోల్పోయిన బాధతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి గ్రామస్తులను కలచివేసింది.

ఉదయం నుంచి గ్రామంలో వినిపించిన రోదనలు వరుసగా రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న విషాదం,బోడబండ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న గ్రామంలో ఒకే సమయంలో ఇద్దరు గుండెపోటుకు గురై మృతి చెందడంతో గ్రామస్తులు టెన్షన్ పడుతున్నారు.

Follow Us
ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!
ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి