Anantapur Politics: కుటుంబానికి ఒక్క టికెట్ అయితే ఓకే.. రెండో టిక్కెట్ అంటే ఆలోచించాలంటున్న అధిష్టానం..!

అనంతపురం జిల్లాలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం అంటే తెలియని వారెవరు ఉండరు. మూడు దశాబ్దాల అనంతపురం రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాలదీ ప్రత్యేకమైన స్థానం. అయితే రాబోయే ఎన్నికల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అన్న సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తెరమీదకి తీసుకురావడంతో ఈ రెండు కుటుంబాలలో రెండో టికెట్ సంగతి ఏంటీ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

Anantapur Politics: కుటుంబానికి ఒక్క టికెట్ అయితే ఓకే.. రెండో టిక్కెట్ అంటే ఆలోచించాలంటున్న అధిష్టానం..!
Chandrababu Jc Diwakar Reddy Paritala Sunitha
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jan 30, 2024 | 1:55 PM

అనంతపురం జిల్లాలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం అంటే తెలియని వారెవరు ఉండరు. మూడు దశాబ్దాల అనంతపురం రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాలదీ ప్రత్యేకమైన స్థానం. అయితే రాబోయే ఎన్నికల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అన్న సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తెరమీదకి తీసుకురావడంతో ఈ రెండు కుటుంబాలలో రెండో టికెట్ సంగతి ఏంటీ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

రాబోయే ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే తాడిపత్రి అసెంబ్లీ బరిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి టికెట్ కన్ఫామ్ అయింది. మరో టికెట్ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడైన పవన్ కుమార్ రెడ్డి అనంతపురం ఎంపీ బరిలో ఉంటారని ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. జేసీ కుటుంబానికి మరో టికెట్ ఇస్తారని ప్రభాకర్ రెడ్డి ధీమాతో ఉన్నారు. ఎందుకంటే అందరూ వేరు.. జేసీ కుటుంబం వేరు అంటున్నారు ప్రభాకర్ రెడ్డి. అందరిని ఒకే ఘాటుకి పార్టీ అధినేత చంద్రబాబు కడతారు అని నేను అనుకోవడం లేదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

2019 ఎన్నికల్లో జేసీ కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించింది టీడీపీ అధిష్టానం. అయితే గడిచిన మూడున్నరేళ్ళుగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి పొలిటికల్‌గా కాస్త ఇనాక్టివ్‌గా ఉండడంతో టిక్కెట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు తమకు రెండు టికెట్లు వస్తాయని చెప్పారు. ఇదిలావుంటే, ఈసారి అనంతపురం ఎంపీ బర్రిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పరిటాల కుటుంబంలో కూడా రాబోయే ఎన్నికల్లో రెండు టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పరిటాల సునీత… ధర్మవరం ఇన్‌చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ రాబోయే ఎన్నికల్లో రాప్తాడు, ధర్మవరం నుంచి పోటీ చేస్తామని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పరిటాల శ్రీరామ్ ను నియమించారు. గడిచిన నాలుగేళ్లుగా పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో కార్యకర్తలతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. రాబోయే ఎన్నికల్లో రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు మావే అంటున్నారు పరిటాల కుటుంబం.

ఇలా జేసీ కుటుంబం, పరిటాల కుటుంబం రెండు టికెట్లు ఆశిస్తుండడంతో టీడీపీ అధిష్టానం అంతర్మధనంలో పడిందట. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న సాంప్రదాయం మాకు వర్తించదు అంటున్నారు జేసీ కుటుంబం, పరిటాల కుటుంబం. చూడాలి మరీ అధినేత చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారు.. ఎవరిని బుజ్జగిస్తారో అన్నదీ..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…