Janasena Party: జనసేన పార్టీ ఆవిర్భావ సభాప్రాంగాణానికి ‘దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక’గా నామకరణం..

|

Mar 10, 2022 | 10:32 AM

Janasena Party: జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఆవిర్భావ సభాప్రాంగాణానికి 'శ్రీ దామోదరం..

Janasena Party: జనసేన పార్టీ ఆవిర్భావ సభాప్రాంగాణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం..
Pawan Kalyan Damodaram
Follow us on

Janasena Party: జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఆవిర్భావ సభాప్రాంగాణానికి ‘శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక’ (Damodaram Sanjivayya Chaitanya vedika)గా నామకరణం చేసి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దళిత దిగ్గజం సంజీవయ్యకు అత్యున్నత గౌరవం కల్పించి.. ఆయన కీర్తిని మళ్ళీ చాటారు. ఇప్పటికే దళితుల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిమాండ్ చేశారు.  వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే జనసేన  అధికారంలోకి వచ్చాక కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు మారుస్తామని పవన్ సంచలన ప్రకటన చేశారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కు సంతాపం తీర్మానం ప్రవేశ పెట్టకపోవడం బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకోవాలని పవన్ సూచించారు.

పేద దళిత కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వెళ్లి, రాజకీయాల్లో చివరి వరకూ  నీతి, నిజాయితీలతో బతికిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య . ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలనే సంకల్పంతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణానికి “శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక”గా నామకరణం చేశారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, పార్టీ భవిష్యత్తు కార్యచరణ ప్రకటించడం కోసం ఒక రాజకీయ పార్టీగా సభను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇన్ని ఇబ్బందులు, ఆటంకాలు కల్పించడం చాలా దురదృష్టకరమన్నారు. గత నెల 28వ తేదీన సభకు అనుమతి, బందోబస్తు కోసం డీజీపీ కార్యాలయానికి లెటర్ రాస్తే ఇప్పటి కి అనుమతిని ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఈ దళితదిగ్గజాన్ని ఓన్ చేసుకోవడంతో దళిత వర్గాలన్నీ ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నాయి. ఈ మేరకు దామోదరం సంజీవయ్య సభా ప్రాంగణం ఇప్పుడు పవన్ చేసే వ్యాఖ్యలతో మారుమోగనుంది. పవన్ చేసిన ప్రకటన మిగతా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో దళితులకు రాజ్యాధికారం వచ్చింది వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో ముఖ్యుడు దామోదరం సంజీవయ్య. ఉమ్మడి ఏపీకి రెండేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండేళ్లలోనే ప్రజాహిత పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read:

పంజాబ్‌లో చీపురుతో దుమ్ము దులిపిన ఆప్.. సీఎం పీఠం కైవసం