MLA Mekapati: నిలువ నీడ లేదు.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై భార్య లక్ష్మీదేవి సంచలన వ్యాఖ్యలు..

|

Jan 09, 2023 | 7:39 AM

ఆస్తి కోసం కాదు, రాజకీయ వారసత్వం కోసం కాదు.. కేవలం ఐడెంటిటీ కోసమే తమ పోరాటం. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుగా చెప్తున్న శివ చరణ్‌ రెడ్డి ఆవేదన ఇది..

MLA Mekapati: నిలువ నీడ లేదు.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై భార్య లక్ష్మీదేవి సంచలన వ్యాఖ్యలు..
Mla Mekapati Chandrasekhar Reddy
Follow us on

ఆస్తి కోసం కాదు, రాజకీయ వారసత్వం కోసం కాదు.. కేవలం ఐడెంటిటీ కోసమే తమ పోరాటం. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుగా చెప్తున్న శివ చరణ్‌ రెడ్డి ఆవేదన ఇది. ఈ క్రమంలో ఎమ్మెల్యే భార్యగా చెప్తున్న లక్ష్మీదేవి సైతం అప్పట్లో ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. నాకు 15 ఏళ్ల ఉన్నప్పుడు పెళ్లంటే ఏంటో కనీస అవగాహన లేని సమయంలో కొండారెడ్డి అనే వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. మా పిన్ని దగ్గర ఉంటున్న సమయంలో నన్ను పెళ్లి చేసుకునేందుకు చంద్రశేఖర్ రెడ్డి మా పెద్దలతో మాట్లాడినా ఒప్పుకోలేదు. రెండేళ్లు మా ఇంటి చుట్టూ తిరిగి చివరికి నాకో వారసుడు కావాలంటూ నన్ను వివాహం చేసుకున్నారంటూ వీడియోలో స్పష్టం చేసింది లక్ష్మీదేవి.

శివ చరణ్ పుట్టాక ఏడేళ్ల వయసు వరకు బాగా చూసుకున్నాడు. అప్పుడే శాంతమ్మ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. అప్పటితో ఇంటికి సరిగ్గా రాకపోగా మా అవసరాలు తీర్చడం తగ్గించారు. వారసుడు కావాలని తనను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టి కొడుకు పుట్టాక రోడ్డున పడేశారంటోంది లక్ష్మీదేవి.

చంద్రశేఖర్ రెడ్డి దూరమయ్యాక ఇల్లు, వాకిలీ లేదు. నిలువ నీడ లేదు. ఏ మాత్రం శక్తి లేని తాము రాజకీయాల్లోకి వస్తామని ఏ విధంగా ప్రచారం చేస్తున్నావంటూ లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే బెంగళూరుకు చెందిన శివచరణ్.. మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన తండ్రిగా చెబుతూ లేఖ రాయడం మాత్రమే కాదు.. చిన్నప్పటి ఫోటోలను సైతం రిలీజ్ చేశాడు. ఈ పరిణామాల క్రమంలో స్పందించిన ఎమ్మెల్యే తనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారంటూ ప్రకటించారు. శివచరణ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మా సొంతూరు కంపసముద్రంలో ఎవర్ని అడిగినా తన తండ్రి ఎవరో చెబుతారు, తన ప్రతీ సర్టిఫికేట్‌లో తండ్రిగా చంద్రశేఖరరెడ్డి పేరే ఉందంటున్నాడు శివచరణ్. తాను డీఎన్ఏ టెస్ట్ కైనా సిద్ధమంటున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..