Election 2024: ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు..

|

May 13, 2024 | 12:35 PM

ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. ఏపీలో ఉదయం 11 వరకు 23.4 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా 11 వరకు 24.31శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు.

Election 2024: ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు..
Ap Telangana
Follow us on

ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. ఏపీలో ఉదయం 11 వరకు 23.4 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా 11 వరకు 24.31శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు. పలు ప్రాంతాల్లో వాతారణం సహకరించకపోయినప్పటికీ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు ఓటర్లు. అలాగే పలు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్‎కు అంతరాయం ఏర్పడింది. దీంతో కొంతసేపు ఆందోళనకు దిగారు ఓటర్లు. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు అధికారులు. పురుషులకంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ఏపీలో ఉదయం 11 గంటల వరకు 23.4 శాతం పోలింగ్ నమోదు..

  • కడపలో 27.17 శాతం
  • చిత్తూరులో 26.10శాతం
  • బాపట్లలో 26.80 శాతం
  • అల్లూరిలో 18.43 శాతం
  • అనకాపల్లిలో 19.97 శాతం
  • అనంతపురంలో 23.91 శాతం
  • అన్నమయ్యలో 22.28 శాతం
  • కృష్ణాలో 26.14 శాతం
  • కోనసీమలో 26.81 శాతం
  • నంద్యాలలో 26.60 శాతం
  • విశాఖలో 20.42 శాతం
  • ఏలూరులో 24.40 శాతం
  • ప.గో.లో23.35 శాతం
  • నెల్లూరులో 23.60 శాతం
  • కర్నూలులో 21.90 శాతం
  • ప్రకాశంజిల్లాలో 24.10 శాతం
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 29 శాతం
  • విజయనగరంలో 23.19 శాతం
  • తూ.గో.లో 21.79 శాతం
  • పల్నాడులో 23.18 శాతం
  • శ్రీకాకుళంలో 21.54 శాతం
  • తిరుపతిలో 22.80 శాతం
  • గుంటూరులో 24.28 శాతం
  • కాకినాడలో 21.45 శాతం
  • సత్యసాయి జిల్లాలో 20.58 శాతం
  • మన్యంజిల్లాలో 18.61 శాతం

తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదు..

  • అదిలాబాద్ -31.51
  • భువనగిరి -27.97
  • చేవెళ్ల -20.35
  • హైద్రాబాద్ -10.70
  • కరీంనగర్-26.14
  • ఖమ్మం-31.56
  • మహబూబాబాద్-30.70
  • మహబూబ్నగర్-26.99
  • మల్కాజిగిరి-15.05
  • మెదక్-28.32
  • నాగర్ కర్నూల్ -27.74
  • నల్గొండ-31.21
  • నిజామాబాద్-28.26
  • పెద్దపల్లి-26.17
  • సికింద్రబాద్-15.77
  • వరంగల్-24.18
  • జహీరాబాద్-31.83
  • సికింద్రబాద్ కంటోన్మెంట్..16.34

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…