AP Weather: ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

|

Sep 03, 2024 | 1:27 PM

ఏపీలో వరుణుడు ఎంతటి బీభత్సం సృష్టించాడో చూశారుగా.. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరదనీటిలోనే ఉన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు ఇంకా కొనసాగతాయా..? వెదర్ రిపోర్ట్ ఇదిగో..

AP Weather: ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Update
Follow us on

సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్ అల్పపీడన కేంద్రం, పశ్చిమ విదర్భ & పరిసర ప్రాంతాలపై నుండి రామగుండం, కళింగపట్నం  ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం.గుండా వెళుతుంది. ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి పైన 3.1 కి.మీ వద్ద దాదాపు 20°ఉత్సర అక్షాంశము వద్ద కొనసాగుతుంది.  సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉపరితల అవర్తనము కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం & పరిసరాల్లో కొనసాగుతున్నది. 05 సెప్టెంబర్, 2024 తేదీ నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం పదండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

మంగళవారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

బుధవారం:-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది

గురువారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

———————————

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

బుధవారం, గురువారం;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..