నిజాయితీ చాటుకున్న యువకుడు

రోడ్డుమీద దొరికే వస్తువు చటుక్కున జేబులో వేసుకునే ఈ రోజుల్లో తనకి దొరికిన మనీ బ్యాగుని జాగ్రత్తగా పోలీసులకు అప్పగించి, పోగొట్టుకున్న వ్యక్తికీ చేర్చాడో యువకుడు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన,  ఆకుల నాగరాజు శనివారం రాత్రి ఇంకోల్లు నుండి పర్చూరు వస్తున్న సమయంలో , పర్చూరు సాయిబాబా ఆలయం సమీపంలో నడి రోడ్డుపై బ్యాగు పడి ఉండటం గమనించాడు . బ్యాగు తీసుకుని చూడగా అందులో పెద్ద ఎత్తున డబ్బులు […]

నిజాయితీ చాటుకున్న యువకుడు
Follow us

|

Updated on: Sep 23, 2019 | 4:12 PM

రోడ్డుమీద దొరికే వస్తువు చటుక్కున జేబులో వేసుకునే ఈ రోజుల్లో తనకి దొరికిన మనీ బ్యాగుని జాగ్రత్తగా పోలీసులకు అప్పగించి, పోగొట్టుకున్న వ్యక్తికీ చేర్చాడో యువకుడు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన,  ఆకుల నాగరాజు శనివారం రాత్రి ఇంకోల్లు నుండి పర్చూరు వస్తున్న సమయంలో , పర్చూరు సాయిబాబా ఆలయం సమీపంలో నడి రోడ్డుపై బ్యాగు పడి ఉండటం గమనించాడు . బ్యాగు తీసుకుని చూడగా అందులో పెద్ద ఎత్తున డబ్బులు ఉండటంతో  తీసుకెళ్లి పర్చూరు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు . ఎస్సై రంగనాథ్ బ్యాగును పరిశీలించగా ఎనిమిది లక్షలు నగదు , కొన్ని దృవీకరణ పత్రాలు ఉన్నాయి . ప్రాథమిక విచారణ లో ఇంకొల్లు మండలం, ఇడుపులపాడు కు చెందిన వ్యక్తి కి చెందినది గా  వెల్లడయింది. డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి పూర్తి ఆధారాలు సమర్పిస్తే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి అందచేస్తామని, ఎస్సై రంగనాథ్ చెప్పారు. నగదు ఉన్న బ్యాగును నిజాయితీగా అప్పజెప్పిన నాగరాజును పోలీసులు అభినందించారు. ఈ సందర్బంగా ఎస్సై రంగనాథ్‌ మాట్లాడుతూ యువత నైతిక బాధ్యతా యుతంగా సమాజంలో వ్యవహరించాలని, తద్వారా నేరాల సంఖ్యా తగ్గుతుందని అన్నారు.

Latest Articles