TDP vs YCP: తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత.. లోకేశ్‌పై రాళ్ల దాడికి యత్నం.. అదుపు తప్పిన పరిస్థితులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో టెన్షన్‌ నెలకొంది. అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లోకేష్‌ను అడ్డుకోవడానికి వైసీపీ వర్గం ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

TDP vs YCP:  తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత.. లోకేశ్‌పై రాళ్ల దాడికి యత్నం.. అదుపు తప్పిన పరిస్థితులు
Tummapudi High Tension
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:01 PM

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో టెన్షన్‌ నెలకొంది. అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లోకేష్‌ను అడ్డుకోవడానికి వైసీపీ వర్గం ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఇందులో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అంతకుముందు ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఒకటి జరిగింది. మృతురాలి కుటుంబీకులను పరామర్శించేందుకు తెనాలి ఆస్పత్రికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక అదే కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ తుమ్మపూడి వెళితే అక్కడే వైసీపీ నేతలు లోకేష్‌ను అడ్డుకున్నారు. ఇంతకీ దుగ్గిరాల ఘటన అత్యాచారం, హత్యా? కేవలం హత్యా? అనేది క్లారిటీ లేదు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ఎస్పీ అంటున్నారు. బాధితుల పరామర్శ తర్వాత రేప్‌ జరిగిందని చెప్పుకొచ్చిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ పద్మ మాట మార్చారు. విచారణ సంగతి తనకు తెలీదన్న త్వరలోనే నిజాలు తెలుస్తాయన్నారు.

అయితే టీడీపీ దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోస్టుమార్టం జరగకముందే రేప్ జరగలేదని ఎలా అంటారని టీడీపీ ప్రశ్నిస్తోంది. తుమ్మపూడికి మృతదేహం ఎందుకు హడావిడిగా తరలించారని ఆరోపించారు. ఘటనలపై లోకేష్‌ సవాల్‌ విసిరారు. దిశ చట్టం ఉంటే 21 రోజుల్లో శిక్షించాలని సవాల్‌ విసిరారు. రోజాపైనా, సజ్జలపైనా లోకేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. చీరలు పంపుతామన్న రోజా ఇలాంటి ఘటనలపై సమాధానం ఏం చెబుతారని ప్రశ్నించారు.

Also Read: Khammam: స్టార్ట్ చేయగానే పల్సర్ బైక్‌లో మంటలు.. కళ్లముందే కాలి బూడిదైన వైనం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు