గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన గుండె చికిత్స.. ఉచితంగానే..

అరుదైన శస్త్రచికిత్సకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వేదికైంది. గతంలో గుండెపోటు వచ్చి రక్త ప్రసరణ అస్తవ్యస్తంగా మారిన రోగికి గుంటూరు వైద్యులు ప్రాణదానం చేశారు. అధిక వ్యయం అయ్యే ఆపరేషన్‎ను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేశారు. గత నెల 22తేదీన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన ఆనందబాబు.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె లయ తప్పి రక్త ప్రసరణలో తేడాలు వచ్చినట్లు గుర్తించారు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన గుండె చికిత్స.. ఉచితంగానే..
Ggh Special Operation
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 16, 2024 | 12:38 PM

అరుదైన శస్త్రచికిత్సకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వేదికైంది. గతంలో గుండెపోటు వచ్చి రక్త ప్రసరణ అస్తవ్యస్తంగా మారిన రోగికి గుంటూరు వైద్యులు ప్రాణదానం చేశారు. అధిక వ్యయం అయ్యే ఆపరేషన్‎ను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేశారు. గత నెల 22తేదీన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన ఆనందబాబు.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె లయ తప్పి రక్త ప్రసరణలో తేడాలు వచ్చినట్లు గుర్తించారు. ఇటువంటి సమయంలో గుండెను చురుగ్గా మార్చి రక్త ప్రసరణను క్రమబద్దం చేసేందుకు ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్ పరికరాన్ని అమర్చాల్సి ఉంటుంది. అయితే ఇది ఖరీదైన పరికరం కావడంతో ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆరోగ్య శ్రీ పథకంలో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.

రోగి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆపరేషన్ చేసి ఐసిడి పరికరాన్ని అమర్చారు. ఈ పరికరంలోని రెండు వైర్లను గుండెలోకి ప్రవేశ పెట్టి ప్రతిక్షణం గుండె కొట్టుకుంటున్న సమయంలో విద్యుత్తు ప్రసరణను ఐసిడికి చేరవేరుస్తుంది. దీంతో గుండె కొట్టుకోవడంతో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే ఐసిడికి తెలిసిపోతుంది. ఆ తర్వాత విద్యుత్ షాక్స్ ఇచ్చి గుండె సాధారణ స్థితికి వచ్చేలా చేస్తుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఐసిడి లేకుంటే గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గుండె మార్పిడి చేసి రోగికి ఐసిడి నుండి విముక్తి కల్గించవచ్చని వైద్యం చేసిన డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఆచార్య శ్రీకాంత్‎తో పాటు సహాయ ఆచార్యులు రాజేంద్ర, శివ శంకర్ ఈ ఆపరేషన్ నిర్వహించారు. విజయవంతంగా ఐసిడి అమర్చిన వైద్య బృందాన్ని జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles