Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం

మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.

Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం
Party Office Attack
Follow us

|

Updated on: Jul 03, 2024 | 8:45 AM

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్‌లు మొదలయ్యాయి. నిన్నటి నుంచి పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దాడి ఘటనపై మరిన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తులో స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న YCP విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య అజ్ఞాతంలో ఉన్నారు..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న ఎటాక్ జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 4 బృందాల్ని రంగంలోకి దించి.. నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. CC ఫుటేజ్‌, ఇతర ఆధారాలతో ఆరోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది పసిగట్టిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు త్వరలోనే గుంటూరు, విజయవాడ, మంగళగిరికి చెందిన కొందరు స్థానిక వైసీపీ నేతల్ని కూడా విచారించబోతున్నట్టు తెలుస్తోంది. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు.

YCP విద్యార్థి విభాగానికి చెందిన చైతన్యకు ఎవరు సహకరించారు.. రౌడీషీటర్ల ప్రమేయం కూడా ఈ దాడిలో గుర్తించిన నేపథ్యంలో వారంతా ఎలా ఎటాక్ చేసేందుకు వచ్చారు.. దీని వెనుక కుట్ర ఎవరిది అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. నిందితులు ఆరోజు ఎవరికార్లలో వచ్చారు.. వారికి సహకరించింది ఎవరు అనేదానిపైనా పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..