శ్రీశైలం డ్యామ్‌ని చూశారా ఎలావుందో..? కన్నుల పండుగగా..

శ్రీశైలం డ్యామ్‌ని చూశారా ఎలావుందో..? కన్నుల పండుగగా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. తాజాగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర… కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఏపీ, తెలంగాణాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి పడుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో అల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోంచి శ్రీశైలంలోని భారీగా వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షా 987 క్యూసెక్కుల నీరు చేరింది. ఇవాళ కూడా మరో రెండు లక్షల క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 07, 2019 | 7:05 PM

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. తాజాగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర… కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఏపీ, తెలంగాణాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి పడుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో అల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోంచి శ్రీశైలంలోని భారీగా వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షా 987 క్యూసెక్కుల నీరు చేరింది. ఇవాళ కూడా మరో రెండు లక్షల క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి.. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 95,963 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 188.1360 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 880 అడుగులు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని జలాశయాల నుంచి సైతం భారీఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తుండడంతో శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు.. కృష్ణా, ప్రధాన ఉపనదులైన తంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాలలో కూడా రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. అటు కుడి, ఎడమ గట్లలోని విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

flood water level increases in srisailam and jurala projects

అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీలో 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 10.87 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 8.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మేడిగడ్డ వద్ద ఆరు లక్షల 90వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… అవుట్‌ ఫ్లో ఆరు లక్షల 88వేలు విడుదల చేశారు. మరోవైపు కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద 10 మీటర్ల మేర గోదావరి వరద ఉదృతి కొనసాగుతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu