Job Fruad: నకిలీ అపాయింట్‌మెంట్లు.. రెండు నెలలు జీతాలు.. ఆ తర్వాత ఎస్కేప్..!

అన్నమయ్య జిల్లా పీలేరులో ఐటీ మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. ఐటి ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ పీలేరు యువకుడు వందలాది మంది నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 300 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు.

Job Fruad: నకిలీ అపాయింట్‌మెంట్లు.. రెండు నెలలు జీతాలు.. ఆ తర్వాత ఎస్కేప్..!
Job Fruad
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 17, 2024 | 6:31 PM

అన్నమయ్య జిల్లా పీలేరులో ఐటీ మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. ఐటి ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ పీలేరు యువకుడు వందలాది మంది నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 300 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు. ఏపీ తెలంగాణకు సంబంధించిన యువతి యువకులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయట పడింది.

అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన రెడ్డి ప్రసాద్ పలు పేర్లతో చలామణి అవుతూ నిరుద్యోగులను మోసగించినట్లు ఎట్టకేలకు గుర్తించారు. సినర్జిక్స్ ఐటీ హెచ్ ఆర్ మేనేజర్‌గా భరత్ కుమార్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు తేలిపోయింది. నకిలీ ఐడీలు, అపాయింట్‌మెంట్స్ ఇచ్చిన భరత్ కుమార్ ఒక్కొక్కరితో ఉద్యోగానికి రూ. 2 నుంచి 4 లక్షల దాకా వసూలు చేశాడు. రెండు నెలలు పాటు జీతాలు ఇచ్చి నమ్మించి ఆపై అడ్రస్ లేకుండా పోయిన భరత్ కుమార్ నిరుద్యోగ యువతను నిండా ముంచాడు.

మోసానికి పాల్పడ్డ రెడ్డి ప్రసాద్ అలియాస్ భరత్ కుమార్ పీలేరుకు యువకుడిగా గుర్తించి పీలేరుకు చేరుకున్న వందలాదిమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయమని బాధితులు వేడుకున్నారు. అయితే ఫిర్యాదును తీసుకోని పోలీసులు తమ పరిధిలో జరగలేదని సంబంధం లేదడంతో పోలీసుల తీరుపై బాధిత యువత లబోదిబో మంటోంది. పోలీసు స్టేషన్ వద్దే పడిగాపులు కాసింది. చివరికి ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..

తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?

మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!

వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత

హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..

చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం

బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..

అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..

OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?