Cyclone Midhili: ముంచుకొస్తున్న మిధిలి తుఫాన్ ముప్పు .. మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరికల జారీ

| Edited By: Surya Kala

Nov 17, 2023 | 11:44 AM

బంగాళాఖాతంలో తుఫాను మిధిలి తీరం వైపు వెళ్తోంది ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 190 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 200, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో మిధిలి ఉంది. 18వ తేదీ నాటికి బంగ్లాదేశ్ ఖేపు పార - మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. తుఫాను ప్రభావంతో వెస్ట్ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది.

Cyclone Midhili: ముంచుకొస్తున్న మిధిలి తుఫాన్ ముప్పు .. మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరికల జారీ
Cyclone Midhili
Follow us on

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. తుపాను కు ‘మిధిలి’ గా నామకరణం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిధిలి కేంద్రీకృతమై ఉంది. తుపాను ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుపాను గమనం ఉంది. బంగాళాఖాతంలో తుఫాను మిధిలి తీరం వైపు వెళ్తోంది ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 190 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 200, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో మిధిలి ఉంది. 18వ తేదీ నాటికి బంగ్లాదేశ్ ఖేపు పార – మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. తుఫాను ప్రభావంతో వెస్ట్ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది.

ఆయా తీరాల్లో బలమైన ఈదురుగాలులు విస్తున్నాయి. మరోవైవు శ్రీలంక ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, తుఫానుకు అనుబంధంగా అల్పపీడన ద్రోని కొనసాగుతోంది. ఏపీలో అక్కడక్కడా చెదురు మదురు వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండి సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..