AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి ఇంటర్నెట్‌.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

వైఎస్ఆర్ డిజిటల్‌ లైబ్రరీలపై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి ఇంటర్నెట్‌.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2021 | 5:03 PM

Share

ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీకి ఇంటర్నెట్‌ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆదేశించారు. ఈ సేవల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ డిజిటల్‌ లైబ్రరీలపై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతపురం, చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలన్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు. విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇంటర్నెట్ సేవలు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి సూచించారు. లైబ్రరీల నిర్వహణ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తిచేస్తామని అధికారులు.. సీఎంకు తెలిపారు. ఉగాది నాటికి ఫేజ్‌-1లో కంప్యూటర్‌ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు వస్తాయని వివరించారు. డిసెంబర్‌ 2022 నాటికి ఫేజ్‌ 2 పూర్తిచేసేలా కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జూన్‌ 2023 నాటికి మూడో దశ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం టార్గెట్‌గా పెట్టుకోవాలని సూచించారు.

డిజిటల్‌ లైబ్రరీల్లో సదుపాయాలు ఇలా..

– మూడు డెస్క్‌ టాపులు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌ కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ ఏర్పాటు. – 3 డెస్క్‌ టాప్‌ టేబుళ్లు, సిస్టం, విజిటర్‌ కుర్చీలు.. ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు, ఐరన్‌ ర్యాక్‌లు ఉంటాయి. న్యూస్ పేపర్స్, మేగజైన్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయి. – కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ స్టూడెంట్స్‌కు అందుబాటులో ఉంటుంది. – ఎవరైనా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లినప్పుడు ఈ డిజిటల్‌ లైబ్రరీల ద్వారా వారి లాప్‌టాప్‌కు కనెక్టయ్యి పని చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?