CM Chandrababu: ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులతో భేటి.. ఈ అంశాలపై చర్చ..

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతిలో చంద్రబాబు పర్యటన పూర్తయింది. రాజధానికి జరిగిన నష్టంపై సీఎం ఓ అంచనాకు వచ్చారు. వాటిపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ఇక త్వరలో ఏపీ బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టనుంది ఎన్డీయే సర్కార్‌.

CM Chandrababu: ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులతో భేటి.. ఈ అంశాలపై చర్చ..
Cm Chandrababu Naidu
Follow us

|

Updated on: Jul 03, 2024 | 8:17 AM

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతిలో చంద్రబాబు పర్యటన పూర్తయింది. రాజధానికి జరిగిన నష్టంపై సీఎం ఓ అంచనాకు వచ్చారు. వాటిపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ఇక త్వరలో ఏపీ బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టనుంది ఎన్డీయే సర్కార్‌. ఈ నేపథ్యంలో అమరావతి, పోలవరంపై ఫోకస్‌ పెడుతూనే, మిగిలిన అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి వీలైనంత ఎక్కవ నిధులు రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే జూలై 3న సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇతర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి ఉన్నారు. జూలై 4న ఉదయం ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో ఆయనను కలిసిననంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న ఇతర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నిధుల విషయంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏయే ప్రాజెక్టులు, స్కీములు కేంద్రం నుంచి రాబట్టవచ్చో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక పారిశ్రామిక రంగానికి రాయితీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారని తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ఢిల్లీ పర్యటన కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిలో ఆసక్తి నెలకొంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం, అందులోనూ టీడీపీ ఎంపీల బలం కేంద్రానికి అవసరం ఉండటంతో ఈసారి నిధులు, ప్రయోజనాలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..