AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే

ఒకటి, ఒకటి, ఒకటి.. రెండు, మూడు, నాలుగు. ఇవీ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. ఏపీ మినిస్టర్స్‌కి ఫైళ్ల క్లియరెన్స్‌లో వచ్చిన ర్యాంకులు. ఇంతకు ఫస్ట్‌ ఎవరు..? లాస్ట్‌ ఎవరు..? సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంకులేంటి..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి

AP News: మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే
Pawan Kalyan Chandrababu
Ravi Kiran
|

Updated on: Feb 06, 2025 | 8:27 PM

Share

ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్‌ ఎలా జరుగుతోంది.? ఎవరు ఫైల్స్‌ త్వరగా క్లియర్ చేస్తున్నారు.? ఇదే అంశం కేబినెట్‌లో చర్చకొచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్‌ వరకూ మంత్రులు క్లియర్‌ చేసిన ఫైల్స్ ఆధారంగా ర్యాంకులిచ్చారు సీఎం చంద్రబాబు. ఈ ర్యాంక్‌ లిస్ట్‌లో ఎన్‌ఎండీ ఫరూఖ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా.. లాస్ట్‌ ప్లేస్‌లో వాసంశెట్టి సుభాష్‌ ఉన్నారు. సీఎం చంద్రబాబు సిక్త్స్‌ ప్టేస్‌, డిప్యూటీ సీఎం పవన్‌ టెన్త్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచారు మంత్రి కందుల దుర్గేష్‌. 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో ప్లేస్‌లో నాదెండ్ల మనోహర్, 5వ స్థానంలో డోలా బాలవీరాంజనేయస్వామి, 6వ స్థానంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక ఏడు సత్యకుమార్, 8 నారా లోకేష్‌, 9 బీసీ జనార్దన్ రెడ్డి, 10వ ప్లేస్‌లో పవన్‌ కళ్యాణ్‌ నిలిచారు.

ఇక 11వ స్థానంలో సవిత, 12 కొల్లు రవీంద్ర, 13 గొట్టిపాటి రవికుమార్, 14 నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్ ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డికి 16, అచ్చెన్నాయుడు 17, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మిడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఫైళ్ల క్లియరెన్స్‌పై ర్యాంకులిచ్చిన చంద్రబాబు.. వేగంగా ఫైళ్లు క్లియర్‌ చేయాలని మంత్రులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి