ఎల్లలు దాటిన ప్రేమ.. పెళ్ళితో ఒక్కటైన కోనసీమ కుర్రోడు కెనడా కుర్రది.. పెళ్లి వారింట విదేశీ బంధువుల సందడి

| Edited By: Surya Kala

Nov 05, 2024 | 9:53 AM

ప్రస్తుతం ప్రేమలు పెళ్ళిళ్ళు దేశాలు దాటి ఖండాంతరాలకు చేరుకున్నాయి. గత కొన్ని ఏళ్లుగా మన దేశానికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు విదేశాలకు చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం వెళ్లి.. అక్కడ విదేశీ యువతీ యువకుల ప్రేమలో పడుతున్నారు. తమ పెద్దలను ఒప్పించి ఆ ప్రేమని పెళ్ళిగా అది కూడా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కోనసీమ జిల్లా వేదికగా కోనసీమ కుర్రోడు విదేశీ అమ్మాయిని పాణిగ్రహం చేసుకున్నాడు.

ఎల్లలు దాటిన ప్రేమ.. పెళ్ళితో ఒక్కటైన కోనసీమ కుర్రోడు కెనడా కుర్రది.. పెళ్లి వారింట విదేశీ బంధువుల సందడి
Unique Love Marriage
Follow us on

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కెనడా అమ్మాయితో అమలాపురం అబ్బాయి పెళ్ళి జరిగింది. జిల్లా ముఖ్య పట్టణం అమలాపురం కు చెందిన మనోజ్ కుమార్ కెనడా కు చెందిన ట్రేసీ రోచే డాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కెనడా నుండి అమలాపురం వచ్చిన కెనడా అమ్మాయికి సంబంధించిన బంధువులు అమలాపురంలో పెళ్ళివారింట సందడి చేశారు. కెనడా దేశాస్తులు భారతీయ సంప్రదాయ వస్తధారణతో రెడీ అయ్యారు. తెలుగు హిందూ సాంప్రదాయంతో జరిగిన పెళ్లిని చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. తెలుగువారి సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు తెలుగు అబ్బాయి.. విదేశీ అమ్మాయి.

2010లో చదువుకోసం అమలాపురం నుండి కెనడా వెళ్ళిన పెళ్ళికొడుకు మనోజ్ కుమార్ కెనడాకు చెందిన ట్రేసీ రోచేడాన్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్ది మధ్య స్నేహం ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ ప్రేమికులు ఇప్పుడు పెళ్లితో భార్య భర్తలు అయ్యారు. స్నేహం ప్రేమగా మారి వివాహంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట అందరినీ ఆకట్టుకుంది. మనోజ్ కుమార్ ప్రస్తుతం కెనడాలో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

తమ కూతురు ప్రేమని అంగీకరించడమే కాదు హిందూ సాంప్రదాయంలో వివాహం జరిపించేందుకు కెనడా నుండి అమలాపురానికి ట్రేసీ తల్లిదండ్రులు తమ స్నేహితులు, బంధువులతో కలిసి వచ్చారు. వీరిదరి పెళ్లి కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రేమను ప్రేమిస్తే ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది అని వీరిద్దరి ప్రేమ కులాలు, మతాలు ప్రాంతాలు దేశాల హద్దులను దాటి ఒక్కటయ్యారు అని అంటున్నారు ఈ జంటను చూసినవారంతా..

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..