Rain Alert: అబ్బా ఎంత చల్లటి కబురో.. అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఎండల తీవ్రతతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ వారాంతంలోగా అండమాన్ తీరాన్ని తాకనున్నట్టు పేర్కొంది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుండటంతో రుతుపవనాల రాకకు మార్గం సుగమమైందని. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పులు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వడగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

Rain Alert: అబ్బా ఎంత చల్లటి కబురో.. అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Ap, Telangana Rain Alert

Updated on: May 13, 2026 | 8:44 AM

అప్పపీడన ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుంటే, మరోవైపు కొన్నిజిల్లాల్లో ఎండలు, వడగాల్పులు జనాలను వణికిస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని. వీటి ప్రభావంతో ఇవాళ అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు.

మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్నిప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us