Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్..!

|

Aug 07, 2021 | 5:50 AM

తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి కరోనా సోకింది. నీరసంగా అనిపించడంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ కరోనా పరీక్షలు చేయించున్నారు.

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్..!
Thota Trimurthulu
Follow us on

Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి కరోనా సోకింది. నీరసంగా అనిపించడంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ కరోనా పరీక్షలు చేయించున్నారు. రిపోర్టులు పరిశీలించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్సీ స్వగ్రామమైన వెంకటాయపాలెంలో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఆయనకు నిన్న కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైసీపీ నాయకులతోపాటు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. తనతో సన్నిహితంగా ఉన్న అధికారులు, కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు.

మరోవైపు ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. శుక్రవారం కొత్తగా 24 గంటల వ్యవధిలో 81,505 శాంపిల్స్‌ని పరీక్షించగా2,209 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,75,455కు చేరింది. మరో 22 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,490కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,896మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,41,372కి చేరింది. ప్రస్తుతం20,593 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి , కడప, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Also Read:  PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే..

Tirupati Kidnap: తిరుపతి కిడ్నాప్‌ కథ సుఖాంతం… తల్లి చెంతకు చేరిన 4 నెలల బాలుడు..

Vizag: పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్ చేస్తే మైండ్ బ్లాంక్

AP 10th Results: పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ.. వారి కోరిక మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.