AP Leads The Chart: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అమరావతి రాజధానిగా కొత్తగా ఏర్పడిన ఏపీ లోటు బడ్జెట్‌తో మొదలైందని చెప్పాలి. పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉండటంతో.. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే కత్తి మీద సాము. అయితే దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సత్ఫలితాలు రావడం మొదలయ్యాయి. అందులో భాగంగానే ప్రైవేట్ పెట్టుబడులు అత్యధికంగా రాష్ట్రానికి తరలివస్తున్నాయి. అంతేకాకుండా వీటిని ఆకర్షించడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం విశేషం.
Also Read: Good News To TSRTC Workers
2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ అత్యధికంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో పోలిస్తే.. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టులలో 10 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ దక్కించుకుని మూడో స్థానంలో నిలవగా.. తెలంగాణ ఆ తర్వాత స్థానంలో నిలిచిందని సర్వే చెబుతోంది. పారిశ్రామికరణకు అనువైన వాతావరణం, నీటి లభ్యత వనరుల వినియోగం, ఇతరత్రా అంశాలు రాష్ట్రంలో మెండుగా ఉండటంతో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.