Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..!

Telangana RTC: ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే మరో గుడ్ న్యూస్ అందించనుంది. కార్మికుల ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఇటీవల నగరంలో నిర్వహించిన కేఎంపీఎల్ అవార్డుల ప్రధానోత్సవానికి విచ్చేసిన ఆయన ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లను అవార్డులతో సత్కరించారు. ఉద్యోగుల బదిలీ, ఓడీ, ఇతరత్రా విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయని సునీల్ శర్మ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు ప్రతీ నెలా రూ.80-90 […]

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..!
Follow us

|

Updated on: Feb 16, 2020 | 2:33 PM

Telangana RTC: ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే మరో గుడ్ న్యూస్ అందించనుంది. కార్మికుల ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఇటీవల నగరంలో నిర్వహించిన కేఎంపీఎల్ అవార్డుల ప్రధానోత్సవానికి విచ్చేసిన ఆయన ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లను అవార్డులతో సత్కరించారు.

ఉద్యోగుల బదిలీ, ఓడీ, ఇతరత్రా విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయని సునీల్ శర్మ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు ప్రతీ నెలా రూ.80-90 కోట్ల ఆదాయం వస్తోందని.. ఇదంతా ఉద్యోగుల సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. ఇక ఇదే పంథా మరికొన్ని నెలలు కొనసాగితే.. డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన అన్నారు.

Also Read: AP Leads Chart In Private Investments 

మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని సునీల్ శర్మ అన్నారు. సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అటు కార్గో సర్వీసులను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, పీఎఫ్ బకాయిలను తొందర్లోనే చెల్లిస్తామని సునీల్ శర్మ స్పష్టం చేశారు.