“సేవాభారతి’ సేవలపై గవర్నర్‌ ప్రశంసలు

” మానవసేవే మాధవ సేవ’ అన్న మాటలను అక్షరాల నిజం చేస్తూ.. సేవాభారతి ప్రజలకు అందిస్తున్న సేవలను ఎంతో గొప్పవంటూ ప్రశంసించారు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సేవాభారతి వారి సంగమం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. విపరీతమైన రసాయనాల వాడకం వల్ల మనం తినే ఆహారం విషతుల్యం అవుతోందనీ, అందుకే మనం మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నామని  వ్యాఖ్యానించారు. ఎలాంటి […]

సేవాభారతి' సేవలపై గవర్నర్‌ ప్రశంసలు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 6:50 PM

” మానవసేవే మాధవ సేవ’ అన్న మాటలను అక్షరాల నిజం చేస్తూ.. సేవాభారతి ప్రజలకు అందిస్తున్న సేవలను ఎంతో గొప్పవంటూ ప్రశంసించారు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సేవాభారతి వారి సంగమం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. విపరీతమైన రసాయనాల వాడకం వల్ల మనం తినే ఆహారం విషతుల్యం అవుతోందనీ, అందుకే మనం మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నామని  వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రతిఫలం లేకుండా, చాలా మంది ప్రముఖులు కలిసి సేవాభారతిని నడిపిస్తున్నారని అభినందించారు. దేశంలో కాలుష్య ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌, మానవాళి మనుగడకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.