Weather Report: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో జాగ్రత్త

Updated on: Jul 04, 2026 | 5:25 PM

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఏపీ విపత్తు నిర్వహణ వాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆల్ప పడీనం, రుతుపవనాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వర్షాల సమయంలో భారీ ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

1 / 5
నిన్నటి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన అల్పపీడనం.. అదే ప్రాంతంలో కొనసాగుతోండగా దీని అనుబంధ  ఉపరితల ఆవర్తనం సగటు  సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు వెళ్ళేకొలది కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాగల 3 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

2 / 5
అలాగే నైరుతి రుతుపవన ద్రోణి ఇప్పుడు నైరుతి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలలో అల్పపీడన ప్రాంతం కేంద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వరకు కొనసాగుతోన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

3 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు ఉరుములతో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే వర్షం సమయంలో గంటకు 40-50 కిలీమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. అలాగే ఆది, సోమ వారాల్లో కూడా ఇలాంటి వాతవరణమే ఉంటుందని తెలిపింది.

4 / 5
ఇక దక్షిణ  కోస్తా  ఆంధ్ర ప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో రాబోయే శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంతో ఉరుములు, మెరుపులతో పాటు సుమారు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.

5 / 5
ఇక రాయలసీమ: ఇక రాయలసీమలోని రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే  బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది. అయితే రాగల 5 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చని స్పష్టం చేసింది.

Follow Us