YS Jagan: దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ పెవిలియన్‌.. ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..

|

May 22, 2022 | 9:00 PM

దావోస్ పర్యటనలో భాగంగా.. మొదట సీఎం జగన్.. WEF వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌తో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పలు అంశాలపై మాట్లాడారు.

YS Jagan: దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ పెవిలియన్‌.. ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..
Follow us on

AP CM YS Jagan Davos Tour: స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (WEF) సదస్సుకు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. కాగా.. ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను (ap pavilion) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం (ys jagan) ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి జగన్ పలు సూచనలు చేశారు.

దావోస్ పర్యటనలో భాగంగా.. మొదట సీఎం జగన్.. WEF వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌తో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పలు అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత జగన్.. అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతోపాటు బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులతో కూడా సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి

వీరితోపాటు సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యామ్‌ బిషేన్‌తో సీఎం జగన్‌ భేటీ అయి ఆరోగ్య రంగంపై చర్చలు జరిపారు.

సీఎం వెంట మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి తదితరులు వున్నారు. కాగా.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో సీఎం జగన్ ఖద్దరు దుస్తులు కాకుండా.. అదిరిపోయే లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం జగన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..