CM Chandrababu: ‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..

|

Jul 01, 2024 | 8:55 AM

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకూ రూ. 1,939 కోట్లు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు అదనంగా మరో రూ.819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వాడల్లో పర్యటించానని బనావత్ రాములుకు వృద్దాప్య పెన్షన్, అయన కుమార్తె సాయికు వితంతు ఫించన్ రూ.7 వేలు అందించానని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు లక్షా 80 వేలు ఆర్థిక సాయం ఇస్తానని.. వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చానన్నారు.

CM Chandrababu: పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం.. సీఎం చంద్రబాబు..
Cm Chandrababu
Follow us on

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకూ రూ. 1,939 కోట్లు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు అదనంగా మరో రూ.819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వాడల్లో పర్యటించానని బనావత్ రాములుకు వృద్దాప్య పెన్షన్, అయన కుమార్తె సాయికు వితంతు ఫించన్ రూ.7 వేలు అందించానని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు లక్షా 80 వేలు ఆర్థిక సాయం ఇస్తానని.. వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చానన్నారు. ప్రతి ఏడాదికి రూ. 33,100 కోట్లు పేదవారి పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో లక్షా 65 వేల కోట్లు పెన్షన్ల కోసం కేటాయిస్తామని తెలిపారు. పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పిన హామీని 24 రోజుల్లోనే పూర్తి చేయడం తమ కమిట్మెంట్ అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో రూ. 35తో ప్రారంభమైన పెన్షన్ ఇప్పుడు రూ. 4వేలకు చేరిందన్నారు.

తన ప్రభుత్వ హయాంలోనే రూ. 2,840 పెరిగిందని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు. ఇలా ఆనందంగా మాట్లాడుకున్న రోజులు గతంలో లేవన్నారు. గతంలో ఏపీ బ్రాండ్ దెబ్బతినిందని చెప్పారు. ప్రభుత్వం దివాలా తీసింది.. అప్పు ఎంతుందో తనకు, తనతోపాటు ఆఫీసర్లకు కూడా తెలియడం లేదన్నారు. పోలవరం పూర్తై ఉంటే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేవాళ్ళమన్నారు. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అబద్దాలకోరును శాశ్వతంగా రాజీయాల నుంచి భూసమాధి చేస్తామన్నారు. ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా కాదని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం పెంచి పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ఆశయం అని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..