Telugu News Andhra Pradesh News AP Budget: Department wise allocations for various welfare schemes and various programs in the ap budget 2025 26
AP Budget: రాష్ట్ర బడ్జెట్‌లో శాఖల వారీగా.. వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు
ఎన్నో సవాళ్లు ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని మంత్రి పయ్యావుల కేశశ్ అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం... ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తన అదృష్టమని మంత్రి కేశవ్ అన్నారు. అభివృద్ధి, సంక్షమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల కాదని.. ఏపీ ప్రజల భవిష్యత్ కలలను సాకారం చేసేది బడ్జెట్ అన్నారు. గృహిణికి భరోసా ఇచ్చేది బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పంతో బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి కేశవ్ స్పష్టం చేశారు.
ఎన్నో సవాళ్లు ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని మంత్రి పయ్యావుల కేశశ్ అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం… ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు. కాగితాలకే పరిమితం కాకుండా… క్షేత్ర స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని మంత్రి వెల్లడించారు. ఈ చొరవతోనే 11.75 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. 2025-26వ ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2025-26 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేశామన్నారు. 2025-26వ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఏపీలో వృద్ధి రేటు సాధించామన్నారు.
2026–27 బడ్జెట్ – ప్రధాన శాఖల కేటాయింపులుః
పాఠశాల విద్య (School Education): రూ. 32,308.32 కోట్లు