తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

మురసు తుఫాన్ ప్రభావం తగ్గినా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. తూర్పు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న అల్పపీడన ప్రాంతం నవంబర్ 5 ఉదయం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Update

Updated on: Nov 05, 2026 | 1:26 PM

తెలుగు రాష్ట్రాల్లో మురసు తుఫాన్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఏపీ, తెలంగాణను అత్యంత భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి.. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ – దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈరోజు, 2026 నవంబర్ 5న ఉదయం 08:30 గంటల సమయానికి బలహీనపడింది. అయితే, దీనికి అనుబంధంగా వున్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల మద్య ఎత్తులో కొనసాగుతోంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 30-40 గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

తెలంగాణలో వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us