Andhra Pradesh: బావిలో మూగజీవుల ప్రాణాలు..! ఎట్టకేలకు ప్రాణాలకు తెగించి..

| Edited By: Srilakshmi C

Oct 09, 2023 | 6:35 PM

అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాలను రక్షించారు స్థానికులు. రెండు గంటల పాటు శ్రమించి రెండు ఆవులను బయటకు తీశారు. గంగరాజు మాడుగుల మండలం ఉరుములో ఈ ఘటన జరిగింది. మాడుగుల మండలం గోమంగి ఉరుములో 20 అడుగుల బావిలో రెండు ఆవులు పడిపోయయి. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, భయంతో నిరసించి పోయయి. గంటలపాటు అందులోనే ఉండిపోయయి. ఆ బావిలో నీరు ఉండడంతో పైకి ఈత లేక బయటకు..

Andhra Pradesh: బావిలో మూగజీవుల ప్రాణాలు..! ఎట్టకేలకు ప్రాణాలకు తెగించి..
Cows Rescued From Well
Follow us on

అల్లూరి ఏజెన్సీ, అక్టోబర్‌ 9: ఏజెన్సీ ప్రాంతంలో మేత కోసం వెళ్ళిన ఆ మూగ జీవాలు దారి మధ్యలో ఉన్న ఓ బావిలో పడిపోయాయి. బయటకు రావాలంటే ఇరవై అడుగులపైనే ఉందా బావి. పోనీ లోపల ఉండాలంటే ఆహారం లేదు. మరోవైపు నీటిలో ఉండలేక పైకి రాలేక అల్లాడిపోతున్నాయి. గాయాలు, ప్రాణ భయంతో నిరసించి పోయాయి. ఇక ఓ గ్రామాస్థుడు చూసి స్థానికులకు సమాచారం అందిచ్చాడు. దీంతో రెండు గంటలు శ్రమించి ఎట్టకేలకు మూగజీవాలను బయటకు తీసుకొచ్చారు.

అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాలను రక్షించారు స్థానికులు. రెండు గంటల పాటు శ్రమించి రెండు ఆవులను బయటకు తీశారు. గంగరాజు మాడుగుల మండలం ఉరుములో ఈ ఘటన జరిగింది. మాడుగుల మండలం గోమంగి ఉరుములో 20 అడుగుల బావిలో రెండు ఆవులు పడిపోయయి. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, భయంతో నిరసించి పోయయి. గంటలపాటు అందులోనే ఉండిపోయయి. ఆ బావిలో నీరు ఉండడంతో పైకి ఈత లేక బయటకు రాలేక అల్లాడిపోయాయి. భయంతో అరుస్తూ ఉన్నాయి. పైకి తీసే వారి సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి ఆ ఆవులు.

రెండు ఆవులు బావిలో పడిపోయియి అన్న విషయాన్ని గుర్తించిన పశువుల కాపరి పెద్దబ్బి.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గిరిజన సమాఖ్య జిల్లా సహా కార్యదర్శి సేగ్గ లక్ష్మణ్, బి కోటేశ్వరరావు ఎస్ చిట్టిబాబు శంకర్రావు, గ్రామస్తులు రెండు గంటలు శ్రమించ్చారు. అంతా చేయి చేయి కలిపారు. ప్రాణాలకు తెగించి కొంతమంది యువకులు బావిలోకి దిగారు. ఒకవైపు నీరు మరోవైపు భయంతో ఉన్న ఆవులు పొడుస్తాయి అన్న భయం.. దీంతో ఎలాగోలా బ్యాలెన్స్ చేస్తూ లోపలికి దిగి తాళ్ల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో బయటకు తీశారు. మూగజీవాలను రక్షించడానికి శ్రమించిన వారిని గ్రామస్థులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.