Andhra Pradesh: “అంతర్జాతీయ వేదికపై రాజధాని పేరు ఏం చెబుతారు”.. సమాధానం దాటవేసిన మంత్రి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన ఉంటుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో జరిగిన దావోస్‌ సదస్సులో ‘అమరావతి’ని పెట్టుబడుల కేంద్రంగా...

Andhra Pradesh: అంతర్జాతీయ వేదికపై రాజధాని పేరు ఏం చెబుతారు.. సమాధానం దాటవేసిన మంత్రి
Gudivada Amarnath
Follow us

|

Updated on: May 19, 2022 | 1:48 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన ఉంటుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో జరిగిన దావోస్‌ సదస్సులో ‘అమరావతి’ని పెట్టుబడుల కేంద్రంగా ప్రమోట్‌ చేశారని, మీరు కూడా అలాగే చేస్తారా అన్న ప్రశ్నకు మంత్రి తెలివిగా సమాధానం ఇచ్చారు. తాము అమరావతిని కాదని, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తామని చెప్పడం విశేషం. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్య తాత్కాలికమైనదేనన్న మంత్రి.. పారిశ్రామికవర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షితులవడానికి ఇది అడ్డంకి కాదని వెల్లడించారు. రాష్ట్ర రాజధాని పేరడిగితే ఏం చెబుతారన్న ప్రశ్నకు ‘ఇప్పుడు ఏమున్నదో అదే చెబుతాం’ అని సమాధానం చెప్పడం గమనార్హం. ఈ నెల 22 నంచి 26 వరకు ముఖ్యమంత్రితో పాటు తానూ పాల్గొంటున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. 18 అంశాల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సులో 10 అంశాల్లో ఏపీ పాల్గొంటోందని వివరించారు. గత ప్రభుత్వం ఇలాంటి సదస్సులకు వెళ్లి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకోవడమే తప్ప అందులో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.

‘రాష్ట్రంలో 974 కిలోమీటర్లు పొడవైన తీరం ఉంది. నాలుగు పోర్టులు ఉన్నాయి. మరో మూడు పోర్టులను నిర్మించాలని నిర్ణయించాం. కాకినాడలోని ఏంకరేజ్‌ పోర్టును పునఃనిర్మించేందుకు మారిటైం బోర్డు ద్వారా రూ.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.50 కోట్లు ఖర్చుచేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కొత్తగా ప్రైవేటు ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నాం. ఈ అవకాశాలన్నింటిని ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరించబోతున్నాం.

       – గుడివాడ అమర్నాథ్, ఏపీ ఐటీశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Viral Video: మేకప్‌ మాయాజాలం.. చూసే కళ్లను సైతం మోసం చేసే విచిత్రం..

Aadhi Pinisetty: పెళ్లిపీటలెక్కిన ప్రేమపక్షులు.. వేడుకగా ఆది, నిక్కీల వివాహం.. సందడి చేసిన టాలీవుడ్‌ హీరోలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు