Andhra Pradesh: నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..

|

Nov 26, 2022 | 1:17 PM

Nellore Court: నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసుపై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. ఫైళ్ల మాయం కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది.

Andhra Pradesh: నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..
AP High Court
Follow us on

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసుపై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. ఫైళ్ల మాయం కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో కీలక ఫైళ్లు మిస్ అయిన విషయం తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలన్నీ మిస్ అయ్యాయి. గత ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కోర్టులో దొంగలు పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 13న అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారు. అయితే, ఈ చోరీని మరుసటి రోజు ఉదయం గుర్తించిన కోర్టు సిబ్బంది.. స్థానిక చిన్నబజారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయిని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఫైళ్ల మాయం కేసు హైకోర్టుకు చేరగా.. తాజాగా హైకోర్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఫైళ్ల మాయం వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..