CM YS Jagan: ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఎందుకో తెలుసా..?

|

Apr 10, 2021 | 9:37 AM

CM YS Jagan: ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే టీకా ఉత్సవ్‌కు ఏపీకి 25 లక్షల డోసుల ....

CM YS Jagan: ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఎందుకో తెలుసా..?
Ys Jagan
Follow us on

ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే టీకా ఉత్సవ్‌కు ఏపీకి 25 లక్షల డోసుల వ్యాక్సిన్లు అవరమని, 11న టీకా ఉత్సవ్‌ ప్రారంభించే లోపు రాష్ట్రానికి అదనంగా 25 లక్షల టీకా డోసులు అత్యవసరమన్నారు. టీకా ఉత్సవ్‌ విజయవంతం కావాలంటే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండటం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. రోజుకు 6 లక్షల మందికి టీకా అందించేలా కార్యచరణ రూపొందించామని, మొత్తం నాలుగు రోజుల్లో 24 లక్షల మందికి వేయనున్నట్లు సీఎం జగన్‌ లేఖలో ప్రస్తావించారు. టీకాలు సరఫరా చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధానిని కోరారు. కేంద్రం తెలిపినట్లే కరోనా పరీక్షల సంఖ్య పెంచామని, ఏ లోటు లేకుండా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని అన్నారు. అయితే తమ రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్‌ పంపాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ లేఖ రాసిన కొద్దిసేపటికే ఏపీ సీఎం జగన్‌ ప్రధాని లేఖ రాశారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ చేస్తున్నామన్నారు. టీకా మహోత్సవంలో ఏపీ పాల్గొనాలి అంటే తక్షణమే అవసరానికి సరిపడే విధంగా 25 లక్షల డోసులు పంపాలని లేఖలో జగన్‌ కోరారు. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఉంది. మరో రెండు రోజులకు సరిపడ వ్యాక్సిన్‌ మాత్రమే స్టాకు ఉంది. తర్వాత కూడా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగాలంటే కేంద్ర నుంచి త్వరగా వ్యాక్సిన్‌ రావాలి. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌కు భారీ డిమాండ్‌ పెరుగుతోంది. మరి అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసే స్టాక్‌ కేంద్రం దగ్గర ఉందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. ఏపీకి కరోనా వ్యాక్సిన్‌ రాకపోతే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ముందు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 2 వేల వరకు కేసులు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే అందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడమే తొలి ప్రాధాన్యం. కానీ సరిపడ స్టాకు వస్తుందా ?లేదా.. అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

అయితే ఈ టీకా ఉత్సవ్‌ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచుతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఒక గ్రామం, వార్డులో టీకా ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. అర్హత కలిగిన వారందరికీ టీకా వేయించుకునేందుకు వైద్యులు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచామని, 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించిన వాలంటీర్ల ద్వారా అర్హులను గుర్తిస్తామన్నారు. రోజుకు 1,145 గ్రామాలు, 259 వార్డుల పరిధిలో అవగాహన కల్పిస్తామని, నాలుగు రోజుల్లో 4,580 గ్రామాలు, 1,036 పట్టణ వార్డుల్లో 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేయిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. టీకా ఉత్సవ్‌కు ఒక్కరోజే సమయం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

ఇవీ చదవండి: Income Tax Rules: అమల్లోకి వచ్చిన కొత్త ట్యాక్స్‌ నియమాలు… అవగాహన పెంచుకోవాలంటున్న ఆర్థిక నిపుణులు

SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్‌..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..

Covid-19: కరోనా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైద్యులు, వైద్య సిబ్బందికి శుభవార్త

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్‌ .. మందు బాబులకు అదిరిపోయే ఆఫర్‌