Andhra Pradesh: ఏపీలో మరోసారి బయపడిన అంబులెన్స్ మాఫియా ఆగడాలు.. అడిగినంత డబ్బు ఇవ్వలేదని..

|

Sep 22, 2022 | 9:00 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు బయటపడ్డాయి. అడిగినంత ఇవ్వనందుకు అరాచకానికి దిగారు.

Andhra Pradesh: ఏపీలో మరోసారి బయపడిన అంబులెన్స్ మాఫియా ఆగడాలు.. అడిగినంత డబ్బు ఇవ్వలేదని..
Ambulance Mafia
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు బయటపడ్డాయి. అడిగినంత ఇవ్వనందుకు అరాచకానికి దిగారు. తిరుపతి జిల్లాలో మరోసారి అంబులెన్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. రుయా ఆస్పత్రి ఇన్సిడెంట్‌ తర్వాత ప్రైవేట్‌ అంబులెన్స్‌ మాఫియాపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. అంబులెన్స్‌ మాఫియా అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక ఆనాడు ఓ తండ్రి… కన్నకొడుకు మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. అంబులెన్స్‌ సర్వీసెస్‌కు ధరలు నిర్ణయించడం చేసింది. కానీ, మళ్లీ ఎప్పటిలాగే రెచ్చిపోతోంది అంబులెన్స్‌ మాఫియా.

తాజాగా తిరుపతి జిల్లా గూడూరులో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోడ్డుప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహాన్ని తరలించడానికి వేల రూపాయలు డిమాండ్ చేయడంతో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అంబులెన్స్‌ డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకోలేక, బయటి నుంచి వాహనాన్ని పిలిపించుకోవడంతో అడ్డుకుంది మాఫియా. దాంతో, బాధితులు ఆందోళనకు దిగారు. కూలి చేసుకుని బతికే తాము, పదిహేను కిలోమీటర్లకు నాలుగు వేలు అడిగితే ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలంటున్నారు బాధితులు. రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్‌ దగ్గర ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ధరలు నిర్ణయించినా, సిండికేట్‌ అవుతోన్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు.. బాధితులను రాబందుల్లా పీక్కూతినేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఆస్పత్రి వర్గాలు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..