ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగు పాటును ముందే పసిగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం, దేవీపట్నం, రామచంద్రాపురంలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కూడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం జిల్లాలో జియ్యమ్మవలస, కురుపాంలో పిడుగు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో పిడుగుపాటును ముందే పసిగట్టే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అమెరికా ఎర్త్ నెట్ నుంచి ఈ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో అరగంట ముందే హెచ్చరికలు జారీ అవుతాయి. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలుగుతున్నారు.