ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబంతో కలిసి వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా బిజీబిజీగా గడిపిన చంద్రబాబు.. అనంతరం ఈవీఎంలపై ఈసీని, కేంద్రాన్ని నిలదీస్తూ.. పోరు సాగించారు. ఇక కాస్త విశ్రాంతి తీసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి.. అక్కడ మూడు రోజుపాటు పర్యటించనున్నారు.