అసత్య ప్రచారాలు చేస్తే తాట తీస్తాం.. పోలీసు బాసుల హెచ్చరిక

లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న తరుణంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేందుకు అసత్య ప్రచారాలకు పాల్పడితే తాట తీస్తామంటున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస్ బాస్‌లు గౌతమ్ సవాంగ్, ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.

  • Rajesh Sharma
  • Publish Date - 2:43 pm, Wed, 15 April 20
అసత్య ప్రచారాలు చేస్తే తాట తీస్తాం.. పోలీసు బాసుల హెచ్చరిక

లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న తరుణంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేందుకు అసత్య ప్రచారాలకు పాల్పడితే తాట తీస్తామంటున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస్ బాస్‌లు గౌతమ్ సవాంగ్, ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ డీజీపీ ఓ అడుగు ముందుకేసి.. ఏకంగా అసత్య ప్రచారాలకు, వదంతులకు చెక్ పెట్టేందుకు డిజిటల్ టెక్నాలజీని వాడుకునేందుకు చర్యలు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలకు సిద్ధమైంది ఏపీ పోలీస్ శాఖ. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో జూం యాప్‌ను ప్రారంభించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు వాట్సప్ నెంబర్ 907166667ను లాంచ్ చేశారు డీజీపీ. జూం యాప్ ద్వారా ప్రజల్లో అవేర్ నెస్ పెంచే కార్యక్రమానాకి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధూ, సినీ నటులు నిఖిల్ సిద్దార్థ, అడవి శేషు తదితరులు పాల్గొన్నారు. లాక్ డౌన్ పరిస్థితిని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని డిజీపీ గౌతమ్ సవాంత్ హెచ్చరించారు.

మరోవైపు తెలంగాణలో వదంతులకు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్దమైంది పోలీసు శాఖ. డీజీపీ ప్రభాకర్ రెడ్డి జారీ చేసిన స్పష్టమైన ఆదేశాల మేరకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వలస కార్మికుల్లో అపోహలు రేపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. వలస కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందని, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్ని అధికారులు క్యాంపుల్లోనే సమకూరుస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. తప్పుడు ప్రచారం నమ్మి ఎవరు స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు. చెక్ పోస్ట్ ఉన్న ప్రాంతాల్లో పోలీసుల కళ్ళు గప్పి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారని, వలస కార్మికులున్న ఏరియాల్లో తప్పుడు వార్తలను, వదంతులను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.