వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై విజయసాయి చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. ఏపీకి యనమలే ఆర్థిక మంత్రి.. కానీ తనను అనడం మంచిది కాదన్నారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి దొంగ ఆడిటర్ కాదా? అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. నిధులు అడిగితే జైలుశిక్ష పడుతుందని జగన్, విజయసాయికి భయమన్నారు. గతం కంటే ఈసారి రాష్ట్ర అప్పులు పెరగలేదని చెప్పారు. ఏపీలో ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని వివరించారు. సంక్షేమానికి చేస్తున్న ఖర్చులకు సంబంధించిన వివరాలను కావాలంటే వైఎస్సార్సీపీకి మెయిల్ ద్వారా పంపుతామన్నారు. ప్రాధాన్యత లేకుండా ఖర్చు చేస్తున్నారని విమర్శించడం తగదన్నారు.
ఏపీ రెవెన్యూ లోటు వచ్చే అయిదేళ్లలో 4.79 లక్షల కోట్లుంటుందని చంద్రబాబుగారి పత్రికలో రాశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే ‘సామాజిక ఆర్థిక మంత్రి’ అయిన కుటుంబరావును అడగాలా? లేక ‘నామమాత్ర ఆర్థిక మంత్రి’ అయిన యనమలను అడగాలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 28, 2019