ఎన్నికల సమయంలో ఏపీలో వరుసగా టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ, ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో.. తాజాగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఇంటిపై సీబీఐ దాడులు జరగడం విశేషం. నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురాంకృష్ణంరాజు ఇంటిపైన సీబీఐ అధికారులు దాడులు జరపడం సంచలనం రేపింది. బ్యాంక్‌లకు రుణాల ఎగవేత కేసులో ఆయనపై సీబీఐ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఎమార్‌లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.