వైసీపీ మౌనమే వారి ఓటమికి సంకేతం- దేవినేని

| Edited By:

May 21, 2019 | 11:12 AM

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి వైసీపీ అధినేత జగన్‌ సంబరపడిపోతున్నారని.. కానీ సైలెంట్‌ ఓటుతో టీడీపీ గెలవబోతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు పేర్కొన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  చిత్తశుద్ధి లేని జగన్ శివ పూజ ఫలించదన్న ఉమ.. రాత్రి వరకు నిలబడి ప్రజలు దొంగలకు ఓట్లు వెయ్యరని చెప్పారు. వెయ్యి శాతం గెలుస్తామని ధైర్యంగా చెప్పగలిగింది టీడీపీ మాత్రమేనన్నారు. ఎన్నికలు ముగిశాక ఈ 40 రోజుల్లో జగన్‌.. వైసీపీ అభ్యర్థులతో మాట్లాడే సాహసం కూడా […]

వైసీపీ మౌనమే వారి ఓటమికి సంకేతం- దేవినేని
Follow us on

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి వైసీపీ అధినేత జగన్‌ సంబరపడిపోతున్నారని.. కానీ సైలెంట్‌ ఓటుతో టీడీపీ గెలవబోతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు పేర్కొన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  చిత్తశుద్ధి లేని జగన్ శివ పూజ ఫలించదన్న ఉమ.. రాత్రి వరకు నిలబడి ప్రజలు దొంగలకు ఓట్లు వెయ్యరని చెప్పారు. వెయ్యి శాతం గెలుస్తామని ధైర్యంగా చెప్పగలిగింది టీడీపీ మాత్రమేనన్నారు. ఎన్నికలు ముగిశాక ఈ 40 రోజుల్లో జగన్‌.. వైసీపీ అభ్యర్థులతో మాట్లాడే సాహసం కూడా చేయలేదని విమర్శించారు. తుని ఘటన నుంచి ఎన్నికల కుట్ర వరకు అన్నింట్లోనూ ప్రశాంత్ కిషోర్ ముద్దాయి అని.. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆయనపై విచారణ చేయిస్తామని చెప్పారు.