27 అర్ధరాత్రి వరకు ఏపీపై కోడ్ వేటు

| Edited By:

May 21, 2019 | 3:59 PM

ఆంధ్రప్రదేశ్‌‌లో మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందన్న ద్వివేదీ.. ఈవీఎంల మొరాయింపు, వీవీప్యాట్‌ లెక్కల్లో తేడా వస్తే రీకౌంటింగ్‌కు అవకాశం ఉండవచ్చన్నారు. పార్టీల మధ్య ఓట్ల తేడా అతి తక్కువగా ఉంటే కూడా రీకౌంటింగ్‌కు అవకాశాలు ఉన్నాయన్నారు. ఫలితాల […]

27 అర్ధరాత్రి వరకు ఏపీపై కోడ్ వేటు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌‌లో మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందన్న ద్వివేదీ.. ఈవీఎంల మొరాయింపు, వీవీప్యాట్‌ లెక్కల్లో తేడా వస్తే రీకౌంటింగ్‌కు అవకాశం ఉండవచ్చన్నారు. పార్టీల మధ్య ఓట్ల తేడా అతి తక్కువగా ఉంటే కూడా రీకౌంటింగ్‌కు అవకాశాలు ఉన్నాయన్నారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.