నెల రోజుల వ్యవధిలో కుటుంబాన్నే మింగేసిన కరోనా

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రాకాసి కోరలకు కుటుంబం మొత్తం బలైంది. విజయవాడ: నగరంలో న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబాన్ని కరోనా కబళించింది

  • Balaraju Goud
  • Publish Date - 2:57 pm, Mon, 2 November 20
నెల రోజుల వ్యవధిలో కుటుంబాన్నే మింగేసిన కరోనా

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రాకాసి కోరలకు కుటుంబం మొత్తం బలైంది. విజయవాడ: నగరంలో న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబాన్ని కరోనా కబళించింది. నెల రోజుల్లో కరోనా బారినపడి నలుగురు ప్రాణాలను కోల్పోయారు. అక్టోబర్ 8న న్యాయవాది తల్లి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అక్టోబర్ 30న న్యాయవాది భార్య కూడా కొవిడ్ కారణంగా కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను మచిలీపట్నంలో నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది ముసావీ కూడా తుదిశ్వాస విడిచారు. కాగా, న్యాయవాది కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో అతను కూడా మరణించారు. కుటుంబం మొత్తం కరోనాతో మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మాయదారి రోగానికి ఓ ప్యామిలియే అంతమైంది.