ఏపీపై ఉగ్ర పంజా..? బీ అలెర్ట్..

ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రవాదులు టార్గెట్ చేశారా..? విధ్వంసాలకు భారీగా కుట్రలు పన్నారా..? తీర ప్రాంతాల గుండా తీవ్రవాదులు చొరబడేందుకు వ్యూహాలు రచించారా..? అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. శ్రీలంక ఉగ్రదాడి నేపథ్యంలో.. ఏపీకి కూడా కేంద్ర నిఘా వర్గాలు కొన్ని హెచ్చరికలు చేసింది. దీంతో.. అప్రమత్తమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇస్లామిక్, వామ పక్ష తీవ్రవాదం హెచ్చరికల నేపథ్యంలో.. […]

ఏపీపై ఉగ్ర పంజా..? బీ అలెర్ట్..
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 4:19 PM

ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రవాదులు టార్గెట్ చేశారా..? విధ్వంసాలకు భారీగా కుట్రలు పన్నారా..? తీర ప్రాంతాల గుండా తీవ్రవాదులు చొరబడేందుకు వ్యూహాలు రచించారా..? అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. శ్రీలంక ఉగ్రదాడి నేపథ్యంలో.. ఏపీకి కూడా కేంద్ర నిఘా వర్గాలు కొన్ని హెచ్చరికలు చేసింది. దీంతో.. అప్రమత్తమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇస్లామిక్, వామ పక్ష తీవ్రవాదం హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేవారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని.. అలానే.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు.