“మండే” టెన్షన్..మండలి రద్దు షురూనా..!

ఏపీ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనమండలి రద్దు వార్తల నేపథ్యంలో రేపటి కేబినెట్‌ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ప్రభుత్వ వ్యూహమేంటి ? మండే మండలికి ఎండ్‌ కార్డ్‌ వేసేందుకే సిద్ధమైందా ? అదే జరిగితే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రతిపక్ష టీడీపీ అడ్డుకోగలదా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే శాసన మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనబడతోంది. మండలి రద్దుకు సంబంధించి సీఎం […]

మండే టెన్షన్..మండలి రద్దు షురూనా..!
Follow us

|

Updated on: Jan 26, 2020 | 9:34 PM

ఏపీ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనమండలి రద్దు వార్తల నేపథ్యంలో రేపటి కేబినెట్‌ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ప్రభుత్వ వ్యూహమేంటి ? మండే మండలికి ఎండ్‌ కార్డ్‌ వేసేందుకే సిద్ధమైందా ? అదే జరిగితే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రతిపక్ష టీడీపీ అడ్డుకోగలదా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే శాసన మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనబడతోంది. మండలి రద్దుకు సంబంధించి సీఎం జగన్‌ ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు. మండలితో దండగ ఖర్చుతో పాటు అభివృద్ధిని అడ్డుకుంటోందని చెప్పకనే చెప్పారు. ఒకవేళ మండలి రద్దు చేయాలని ప్రభుత్వం ఫిక్సైతే..ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొదట కేబినెట్‌ భేటిలో శాసనమండలి రద్దుపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9.30కి ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశంలోనూ ఇదే అంశంపై హాట్‌ డిబేట్‌ జరగనుంది. సభలో రద్దు తీర్మానం ప్రవేశపెడితే దానిపై వాడీవేడీ చర్చ జరిగే అవకాశముంది. రద్దు నిర్ణయంపై ఓటింగ్ జరిగితే… ఆటోమేటిక్‌గా ప్రభుత్వానిదే మెజార్టీ కాబట్టి… రద్దు నిర్ణయానికి అసెంబ్లీలో ఆమోదం లభిస్తుంది. అనంతరం ఆ తీర్మాన బిల్లును కేంద్రానికి పంపనున్నారు. అందుకే కేబినెట్‌ భేటీ కీలకం కాబోతోంది.

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు మండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పేర్లు ఇవ్వాలని అన్నీ పార్టీలకు లేఖ రాశారు. 9 మందితో సెలక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులకు రెండు సెలెక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా సంబంధిత మంత్రులను నియమించారు. ప్రస్తుతం బిల్లు కౌన్సిల్‌ పరిధిలో ఉందని చైర్మన్‌ షరీఫ్‌ తెలిపారు. తాను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. మండలి రద్దు వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద వార్‌ జరుగుతుందని అనుకుంటే…. అసలు సభకే వెళ్లకూడదని టీడీపీ నిర్ణయించడం షాక్‌కి గురి చేసింది. దీని వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ