కోలీవుడ్ పై కన్నేసిన రంగమ్మత్త .. విజయ్ సేతుపతి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న అనసూయ.?

అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఓ వైపు యాంకర్ గా పలు టీవీషోలో ఆకట్టుకుంటూ మరో వైపు నటిగాను సత్తా చాటుతుంది ఈ భామ.

కోలీవుడ్ పై కన్నేసిన రంగమ్మత్త .. విజయ్ సేతుపతి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న అనసూయ.?
Follow us

|

Updated on: Dec 05, 2020 | 3:08 PM

అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఓ వైపు యాంకర్ గా పలు టీవీషోలో ఆకట్టుకుంటూ మరో వైపు నటిగాను సత్తా చాటుతుంది ఈ భామ. సుకుమార్ రామ్ చరణ్ కాబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త గా అనసూయ నటన అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అనసూయ తాజా ఓ భారీ ఆఫర్ ను దక్కించుందని తెలుస్తుంది.  ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.

అనసూయ ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలసినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇప్పడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అదికూడా స్టార్ విజయ్ సేతుపతి సినిమాతో అని అంటున్నారు..కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సిల్క్ స్మిత తరహాలో మేకప్ వేసుకుంటున్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫొటోతో పాటు ‘తమిళ చలనచిత్ర పరిశ్రమలో కొత్త ప్రయాణం మొదలైంది`అంటూ రాసుకొచ్చింది. తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న  అనసూయ కోలీవుడ్ లో కూడా రాణిస్తుందేమో చూడాలి.