అమెరికాలో నివసిస్తోన్న వేలాది మంది భారతీయ హెచ్1 బీ వీసాదారులకు అమెరికన్ న్యాయస్థానం ఊరట కలిగించింది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే తీర్పునిచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగాల్ని కల్పిస్తూ.. ఒబామా ప్రభుత్వం తెచ్చిన నిబంధనను ట్రంప్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ.. దాఖలైన దావాలాపై.. వాదనలు విన్న అమెరికా కోర్టు.. ట్రంప్ సర్కార్ షాక్ నిచ్చింది. ఈ నిర్ణయాన్ని పున: పరిశీలించాలని దిగువ కోర్టును యూఎస్ కోర్ట్ సూచించింది. ఈ వివాదంపై క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని కోరింది. అప్పటి వరకూ ఈ నిబంధనను నిలుపుదల చేయాలని ట్రంప్ సర్కార్‌ను కోర్టు ఆదేశించింది.
కాగా.. ప్రస్తుతం యూఎస్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో.. వేలాది మంది ప్రవాస భారతీయులకు తాత్కాలిక ఉపశమనం కలిగిందనే చెప్పాలి. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ.. ఒబామా ప్రభుత్వం ఈ విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది. అయితే.. దీనివల్ల స్థానికులు నష్టపోతున్నారని.. అమెరికాలో ఉద్యమాలు తలెత్తాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. హెచ్-1 బీ వీసాలపై కోత పెడుతూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో.. ముఖ్యంగా భారతీయ వీసాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. తాజాగా.. అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్లీ ఈ ఆశలు చిగురిస్తున్నాయి.